జెట్‌ఎయిర్‌వేస్‌ రూట్లలో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌లు

SMTV Desk 2019-05-25 16:15:49  jet airways, air india, spicejet

న్యూఢిల్లీ: ప్రముఖ విమాన సంస్థ జెట్‌ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్థ కొనసాగించిన రూట్లలో కొత్త విమానాలను ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌లు నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎయిర్‌ ఇండియా బుధవారమే దుబాయి రూటుకు మరిన్ని విమానాలు వెల్లడించింది. అలాగే స్పైస్‌జెట్‌ కూడా 20 కొత్త దేశీయ విమానసర్వీసులుప్రకటించింది. దేశీయ అంతర్జాతీయ రూట్లలోకూడా ఈ రెండుసంస్థలు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేసిన రూట్లలో సర్వీసులు నడపాలని నిర్ణయించాయి. ఎయిర్‌ఇండియా వారానికి 3500 అదనపు సీట్లను ముంబయి, దుబాయి, ఢిల్లీ దుబాయి సెక్షన్లలో నడపాలనినిర్ణయించింది. జెట్‌ విమానాలునిలిచిపోవడంతో అంతర్జాతీయ రూట్లలో రద్దీ ఎక్కువపెరిగింది. పలితంగా ప్రభుత్వం ఈరెండుసంస్థలకు రూట్లను కేటాయించింది. జాతీయ విమానయానసంస్థ అయిన ఎయిర్‌ఇండియా జెట్‌ కోటాలో అంతర్జాతీయ సీట్లను ఎక్కువ సాధిస్తే ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, విస్తారా వంటివి కొత్త రూట్లపరంగా లబ్దిపొందాయి. గత ఏడాది అంతర్జాతీయ కార్యకలాపాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ భారత్‌లోనే అతిపెద్ద విమాన ఆపరేటర్‌గా నిలిచింది. 13.8 శాతం మార్కెట్‌వాటా సాధించింది. అయితే జెట్‌ నిలిపివేతకారణంగా అంతర్జాతీయ రూట్లలో 15-20శాతం దరలు పెరిగిపోయాయి. ఇక దుబాయితోపాటు ఎయిర్‌ఇండియా బహుళ రూట్లలో కొత్త విమానాలు ప్రవేశపెట్టింది.