అమెరికా- ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం

SMTV Desk 2019-05-25 16:09:25  Foreign Office Spokesperson Dr Mohammad Faisal, america, iran

ఇస్లామాబాద్‌: అమెరికా- ఇరాన్ దేశాల మధ్య వివాదాలు రోజురోజుకి పెరుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావాద్‌ జరీఫ్‌తో చర్చించిన పాక్‌ విదేశాంగ మంత్రి షామహ్మద్‌ ఖురేషితో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం పాక్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ మీడియాతో మాట్లాడుతూ... అవసరమైతే అమెరికా-చైనా మధ్య నిర్మాణాత్మక చర్చల ప్రక్రియను చేపట్టటంలో సానుకూల పాత్రను పోషించేందుకు తమ దేశం సిద్ధంగా వుందని చెప్పారు. ఉద్రిక్తతల పెరుగుదలను తాము అన్నివేళలా వ్యతిరేకిస్తామని, అన్ని సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నది తమ భావన అని ఆయన అన్నారు. ఒక వేళ ఏదైనా సమస్య వుంటే దానిని శాంతియుతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.