'యాత్ర 2' ముచ్చట్లు: తెరపైకి మహేష్, రానా పేర్లు

SMTV Desk 2019-05-25 16:08:37  yatr2

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం నేపథ్యంలో.. ‘యాత్ర’ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ట్విటర్ వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. నేపథ్యంలో యాత్ర సీక్వెల్ తెరపైకి వచ్చింది.

యాత్ర2 కోసం నెటిజన్స్ హీరోని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే జగన్ పాత్రకి చక్కగా సరిపోతాడని చెబుతున్నారు. రానా దగ్గుపాటి పేరు కూడా వినిపిస్తున్నారు. వీరిద్దరు తెరపై రాజకీయాలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్నారు. అందుకే జగన్ పాదయాత్ర కోసం మహేష్, రానా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరీ.. మహి వి రాఘవ్ ఎవరికి ఎంచుకొంటారనేది చూడాలి. ఇక, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద’యాత్ర’ తెరపై కూడా ఘన విజయం అయిన సంగతి తెలిసిందే.