కడుపులో నుండి బయటపడిన...... స్పూన్లు, కత్తులు, టూత్ బ్రష్‌లు

SMTV Desk 2019-05-25 16:04:17  spoons

ఓ మానసిక రోగి కడుపులో స్పూన్లు, కత్తులు, స్రూడ్రైవర్లు, టూత్ బ్రష్‌లు వెలుగుచూసిన ఉదంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ నగరంలో సంచలనం రేపింది. 35 ఏళ్ల ఓ వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతూ మండీ నగరంలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్యకళాశాలలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతని కడుపులో 8 స్పూన్లు, రెండు స్రూడ్రైవర్లు, 2 టూత్ బ్రష్‌ లు, ఓ కిచెన్ కత్తి ఉన్నాయని తేల్చారు. అతనికి శస్త్రచికిత్స చేసి కడుపులోనుంచి స్పూన్లు, కత్తులు, టూత్ బ్రష్ లను తొలగించారు. కత్తులు, స్పూన్లను సాధారణ వ్యక్తి మింగలేడని, మానసిక రోగంతోనే అతను ఇలాంటివి మింగాడని డాక్టర్ నిఖిల్ చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నాడని వైద్యులు వివరించారు.