చోరీకి వచ్చి ఇల్లు శుభ్రం చేసి వెళ్లారు...వైరల్ స్టొరీ

SMTV Desk 2019-05-25 15:47:18  thieves are cleaning house

వాషింగ్టన్: అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏ వస్తువూ ముట్టుకోకుండా ఇల్లంతా శుభ్రం చేసి చెక్కేశారు. పూర్తి వివరాల ప్రకారం...బోస్టన్‌కు చెందిన రోమన్ అనే వ్యక్తి.. ఆఫీసుకు వెళ్లే ముందు ఇంటి వెనుక ఉన్న డోర్‌ను వేయడం మరిచిపోయాడట. అతడు ఆఫీసుకు వెళ్లాక.. కొందరు దుండగులు అతడి ఇంట్లో దూరారు. అయితే.. ఇంట్లోని ఏ వస్తువునూ వాళ్లు ఎత్తుకెళ్లలేదు. ఇంటినంతా శుభ్రం చేశారు. బాత్‌రూమ్స్‌ను కూడా వదల్లేదు. వాటిని కూడా శుభ్రం చేశారు. బెడ్‌రూమ్‌లో బెడ్‌ను కూడా మంచిగా అరేంజ్ చేశారు.చివరకు టాయిలెట్ పేపర్‌తో రోజ్ ఆకారంలో డెకరేట్ చేసి వెళ్లిపోయారు. ఆఫీసు అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన రోమన్.. ఇల్లును చూసి ఆశ్చర్యపోయాడు. తన ఇల్లు ఇంత క్లీన్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.తర్వాత చూస్తే.. ఇంటి వెనుక డోర్ తెరుచుకొని ఉంది. దీంతో ఎవరో వచ్చి ఇంటిని క్లీన్ చేశారని తెలుసుకున్నాడు. అయితే..హౌస్‌కీపింగ్‌కు సంబంధించిన వ్యక్తులెవరైనా తప్పు అడ్రస్‌కు వచ్చి ఇలా తన ఇల్లు క్లీన్ చేశారేమో అని అనుకున్నాడట రోమన్. ఈ వింత ఘటనను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. దీంతో నెటిజన్లు కూడా ఆ స్టోరీ చదివి ఆశ్చర్యపోతున్నారు.