ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్ కి పీవీ సింధు, సైనా

SMTV Desk 2017-08-26 12:30:16  PV Sindhu, BWF, Women singles, Saina Nehwal, World Badminton championship

ఎమిరేట్స్ అరేనా, ఆగస్ట్ 26: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు మహిళల సింగిల్స్‌ తమదైన శైలిలో గెలుపు పథంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లలో వీరు విజయం సాధించారు. దీంతో ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో వారికి ప‌త‌కాలు ఖాయం అయ్యాయి. క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌.. స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌ ఆడనుంది. అలానే పీవీ సింధు, చైనా షట్లర్‌ సన్ యూతో క్వార్టర్‌ ఫైనల్లో పోరాడి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. కాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమెకు ఇది మూడో పతకం కానుంది. అంతేకాకుండా ఈ రికార్డు సాధించిన తొలి భారత షట్లర్‌ కూడా సింధునే కావడం విశేషం. నేడు జరిగే సెమీ ఫైనల్లో సింధు, సైనా విజయం సాధిస్తే.. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటి ఉండే అవకాశాలున్నాయి.