మోదీకి షారూఖ్ ఖాన్ అభినందన

SMTV Desk 2019-05-25 15:27:21  modi

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను కైవసం చేసుకొని, రెండోసారి ఘన విజయం సాధించిన నరేంద్రమోదీని బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ అభినందించారు. ‘‘మేం పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పునిచ్చాం...ప్రజాస్వామ్యంలో ఘన విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీ నేతలకు అభినందనలు...’’ అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ ప్రశంసిస్తూ బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, అజయ్ దేవగన్, రవీనాటాండన్, వరుణ్ ధావన్, పరిణితీ చోప్రా, కరణ్ జోహార్ లు అభినందనల వర్షం కురిపించారు.