టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లికి హాజరైతే ఆశ్చర్యమేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం.....బన్నీ హాజరైన పెళ్లి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ ది. బన్నీ వంటి స్టార్ హీరో పెళ్లికి హాజరు కావడంతో వరుడు, వధువు సహా బంధుమిత్రులు ఆనందంతో ఆశ్చర్యపోయారట. కాగా శిరీష్ గీతా ఆర్ట్స్‌లో అసిస్టెంట్ బాయ్‌గా జాయిన్ అయ్యాడు. కానీ డ్యాన్స్ పట్ల తనకు ఉన్న ఆసక్తిని గమనించిన బన్నీ, డ్యాన్స్ నేర్చుకోవడానికి ట్రయినింగ్ ఇప్పించాడట.