వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ పోస్ట్

SMTV Desk 2019-05-24 16:45:35  dear comrade, vijay deverakonda

విజయ్ దేవరకొండ..ఈ పేరు చెపితే చాలు యూత్ ఊగిపోతారు..అందరూ సినిమాలు చూసి వారికీ అభిమానులైతే..విజయ్ కి మాత్రం ఆయన మాటలు..యాటిట్యూడ్‌ చూసి ఫ్యాన్స్ అవుతున్నారు. అర్జున్ రెడ్డి చిత్ర తర్వాత విజయ్ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసిన..ఏం మాట్లాడిన..చివరకు సోషల్ మీడియా పేజీ లలో కామెంట్స్ పెట్టిన గానీ అభిమానులు దాని వైరల్ చేస్తుంటారు.

తాజాగా విజయ్ చేసిన కామెంట్ పట్ల కాస్త ఓవర్ చేసాడు కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తో జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం ఫేమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా భరత్ కమ్మ అనే నూతన డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.

ఇక సినిమాలోని సెకండ్‌ సింగిల్ ఆదివారం విడుదల కానుంది. ఈ విషయాన్ని విజయ్ తన ట్విట్టర్ లో ప్రకటిస్తూ ఆ పాటను సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అనేశాడు. ఇంకా పాట రిలీజ్‌ కాకముందే విజయ్‌ సాంగ్‌ ఆఫ్ ద ఇయర్‌ అని ప్రకటించటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. సాంగ్ వచ్చాక తెలుస్తుందని కొందరు అంటే..విజయ్ కాస్త ఓవర్ అయినట్లు లేదు అని మరికొంతమంది సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.

డియర్ కామ్రేడ్ జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.