జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించిన పాకిస్తాన్

SMTV Desk 2019-05-24 16:40:35  jai-she mohammed, terrorist

పాకిస్థాన్ ఎట్టకేలకు ఉగ్రవాదంపై పొరుగుదేశాలను సంతృప్తి పరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. గతకొంతకాలంగా భారత్ కు తలనొప్పిగా మారిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై తాజాగా నిషేధం విధించింది. జైషే సంస్థ సహా మొత్తం 12 అతివాద సంస్థలపై పాక్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు తెలిపింది. మౌలానా మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ లతో సంబంధాలున్నాయని భావిస్తున్న ఈ 12 సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చారు.

జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ పై ఇటీవలే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఐక్యరాజ్యసమితి ప్రకటన వెలువడిన కొన్నిరోజులకే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకుంది. ఇప్పుడా సంస్థ పేరు జైషే ముత్తాఖీ! మరి, పాకిస్థాన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల్లో జైషే మహ్మద్ ఉంది కానీ, జైషే ముత్తాఖీ ఉందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.