నాగశౌర్య సినిమాకి రాఘవేంద్ర రావు క్లాప్

SMTV Desk 2019-05-24 16:36:42  naga shaurya, raghavendra rao

యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. సొంత బ్యానర్లో నర్తనశాల చేసి పరాజయాన్ని చవిచూసిన నాగశౌర్య, కొంత గ్యాప్ తీసుకుని తన బ్యానర్లోనే మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు.

కొంతసేపటి క్రితం హైదరాబాద్ - మాదాపూర్ లోని వీఎస్ ఎస్ స్క్వేర్ లో ఈ సినిమాను లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా .. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ నెల 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.