ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

SMTV Desk 2019-05-24 16:13:19  vote, elctions,

ఢిల్లీలోని ఏడు లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఔరంగజేబు లైన్‌ లోగల పోలింగ్‌ బూత్‌ లో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ ఓటు వేశారు. గత ఎన్నికల్లో లోక్‌ సభకు ప్రాతినిధ్య వహించిన సుష్మాస్వరాజ్‌, ఈసారి పోటీ చేయడంలేదు.

కేంద్రమంత్రి విజయ్‌ గోయల్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి విజయ్‌ గోయల్‌ ఓటువేశారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమావ్యక్తంచేశారు. రాజధాని కేంద్రంలో ఏడు లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తోంది.

మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈస్ట్‌ ఢిల్లీలోని పదిహేడవ పోలింగ్‌ బూత్‌ లో కుటుంబ సభ్యలతో కలిసి కపిల్‌ దేవ్‌ ఓటువేశారు. ఆరో విడత పోలింగ్‌ జరుగతుంగా, ఢిల్లీలోని ఏడు లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతుంది. రాజకీయ నేతలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

యూపీఏ చైర్ పర్సన్‌ సోనియా గాంధీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ పోలింగ్‌ బూత్‌ లో సోనియా గాంధీ ఓటేశారు. ఆరో విడతలో ఢిల్లీలోని ఏడు లోక్‌ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీ లోక్‌ సభ స్థానం నుంచి మరోసారి పోటీపడుతుంది. ఢిల్లీలో ఓటు ఉండడంతో సోనియా ఓటుహక్కు వినియోగించుకున్నారు.