స్పెషల్ గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని

SMTV Desk 2019-05-24 15:59:42  abcd

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏబిసిడి. ఈ సినిమా అమెరికాలో పెరిగొచ్చిన హీరో ఇండియా వచ్చి ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్నది చూపిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ ఇప్పుడు పెద్దవాడై హీరో ఫ్రెండ్ రోల్ చేయడం విశేషం. రుక్సార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ మొన్నామధ్య రిలీజై పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.

ఇక ఈ నెల 17న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం మే 13న ఎన్ కన్వెన్షన్ లో జరుపనున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని వస్తున్నాడు. ఈమధ్యనే జెర్సీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని అల్లు శిరీష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు వస్తున్నాడు. నాని వస్తున్నాడన్న విషయం తెలిసిన శిరీష్ నానికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.