మహర్షి మూవీ పై కత్తి మహేష్ విమర్శలు

SMTV Desk 2019-05-24 15:57:44  Kathimahesh, Pooja Hegde

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు, పూజా హెగ్దే కలిసి జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ మొన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ నుంచి ఇప్పటివరకు మంచి పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. అంతేకాదు సినిమా చూసిన చిరంజీవి కూడా మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కానీ ఈ సినిమాపై క్రిటిక్ కత్తి మహేశ్ విమర్షలు గుప్పించాడు.

అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పూజా హెగ్దేకు నటించడం రాలేదని, తెలుగు అమ్మాయిలను పక్కనపెట్టి పూజాకు అవకాశం కల్పించడమే మహర్షి టీం చేసిన పెద్ద తప్పు అని అన్నాడు. అంతేకాదు మహర్షి సినిమాలో బ్రేకప్ సీన్ ఉన్నప్ప్పుడు హీరో మన దారులు వేరు, గమ్యాలు వేరు కాబట్టి ఇక్కడే విడిపోదాం అని అని అన్నప్పుడు హేరోయిన్ ప్రేమించిన ప్రేమికుడు దూరం అవుతున్నప్పుడు ఆమెకు ఆ బాధ గుండెల్లో నుంచి రావాలి. కానీ పూజా మాత్రం ఏదో క్యాజ్‌వల్ ఎక్స్ప్రెషన్ పెట్టిందని కత్తి మహేశ్ అన్నాడు. పూజా చూడడానికి అందంగా ఉన్నా నటన మాత్రం కాస్త తక్కువైందని, తాను ఇప్పటి వరకు చూసిన హీరోయిన్లలో ఇలాంటి చెత్త నటనను చూడలేదన్నారు. పెద్ద హీరోలతో ఇలాంటి భారీ చిత్రాలను తీస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిద్దుకొకపోతే ఇలాంటి తప్పిదాలే చవిచూడాల్సి ఉంటుందని కత్తి అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎంతో మంది తెలుగు అమ్మాయిలు ఉన్నా కోట్లు ఖర్చు పెట్టి నటన రాని వారిని కొనుక్కోవడం ఏమిటని ఆయన అన్నారు. ఇలాంటి తప్పిదాలు చేయడం వలన సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని, ఆ భారాన్ని కప్పి పుచ్చుకునేందుకు సినిమా టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకులపై ఆ భారన్ని మోపడం సరికాదని కత్తి ఆరోపించారు. అయితే పూజ నటన బాలేదని చెప్పిన కత్తి మహేశ్‌పై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.