ఘనంగా గంగా సప్తమి వేడుకలు

SMTV Desk 2019-05-24 15:44:15  Ganga Sapthami celebrations,

ఉత్తరప్రదేశ్‌ లో గంగా సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారణాసి ఈ వేడుకలతో కొత్త శోభను సంతరించుకుంది. గంగాదేవి అవతరించిన వైశాఖ శుద్ధ సప్తమినే గంగా సప్తమిగా నిర్వహించుకుంటున్నారు భక్తులు. నదీతీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గంగాస్తోత్రం చదివి పూజలు నిర్వహిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.