మహర్షి మూవీ కాపీ అట ?

SMTV Desk 2019-05-24 14:47:49  Maharshi, Copy

సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రస్తుతం దీనిపై కాపీ ముద్ర పడడడం చర్చనీయాంశమైంది. ఇది వంశీ పైడిపల్లి.. దిల్ రాజు బృందం తయారు చేసుకున్న ఒరిజినల్ కథాంశం కాదన్న ఓ ఆరోపణ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజుకు సన్నిహితుడయిన టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇది తన కథ అంటూ నిర్మాత దిల్ రాజుతో అన్నారట.

తన లైన్ తీసుకుని ఏకంగా సినిమాగా తీస్తారా? అని ఆయన ప్రశ్నించారట. దర్శకుడు వంశీ కానీ.. దిల్ రాజు కానీ అసలు ఇది మీ లైన్ అన్న విషయం తమకు తెలీదని శ్రీవాస్ తో అన్నారట. అయినా సరే దిల్ రాజుతో ఉన్న చనువు దృష్ట్యా ఈ విషయం మీద ఎక్కడా తను మాట్లాడనని శ్రీ వాస్ మాటిచ్చారట, దీతో శ్రీ వాస్ కి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాకి ఛాన్సిచ్చారట రాజుగారు. మొత్తానికి అలా ఇది వివాదంగా మారకుండా తనదైన శైలిలో ట్రీట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. శ్రీవాస్ ఇదివరకూ దిల్ రాజు బ్యానర్ లో `రామ రామ కృష్ణ కృష్ణ` సినిమాని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే.