రికార్డు అలెర్ట్: 150 వికెట్లు తీసిన హర్భజన్

SMTV Desk 2019-05-24 13:13:06  Harbhajan,

ఐపీఎల్ లో భారత సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ అరుదైన మైలు రాయి అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్ మన్ రూథర్ ఫర్డ్ వికెట్ తో భజ్జీ ఈ మార్కును దాటాడు. ఈ జాబితాలో మలింగ 169, అమిత్ మిశ్రా 157, అతనికంటే ముందున్నారు. పియూష్ చావ్లా ఖతాలోకూడా 150 వికెట్లు ఉన్నాయి.