రేవ్ పార్టీలో వైసీపీ నేతలు

SMTV Desk 2019-05-24 12:54:50  rave party, east godavari district, dances

జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. పెనుమంట్ర మండలం మార్టేరులో ఒక కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. పోడూరు మండలం కవిటంకు చెందిన ఒక వ్యాపారవేత్త తన పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఐదుగురు యువతులతో అసభ్య నృత్యాలు నిర్వహించారు. ఈ రేవ్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి కళ్యాణ మండపానికి వెళ్లారు. అమ్మాయిలు డ్యాన్సులు వేయడాన్ని చూడటంతో ఐదుగురు యువతులతో పాటు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.