కాజల్ నిర్మాణంలో మేఘా ఆకాష్

SMTV Desk 2019-05-24 12:52:32  kajal, tollywood heroine, temper, south actress

న‌టీనటులు, సాంకేతిక నిపుణులు సినిమాకు సంబంధించిన ఇత‌ర విభాగాల్లో కూడా రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హీరో, హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే వారు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణ రంగంలో కూడా ఆస‌క్తి చూపుతున్నారు మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రానా, నాని.. ఇలా చాలా మంది హీరోలు ప్రొడక్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసిన‌వారే. టాలీవుడ్ హీరోయిన్స్‌లో కాజ‌ల్ అగర్వాల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత స్టార్ హీరోయిన్స్‌లో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న హీరోయిన్ కాజల్ మాత్రమే.

వివ‌రాల్లోకెళ్తే.. రాజ్‌కందుకూరి త‌నయుడు శివ కందుకూరి హీరోగా రెండో సినిమా ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. "అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన `RX100` సినిమాకు కోడైరెక్ట‌ర్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాకు స‌మ‌ర్పకురాలిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ అంగీక‌రించారు" అని రాజ్‌కందుకూరి తెలిపారు.