స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్.. తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయిన పిల్లాడు.. వీడియో వైరల్

SMTV Desk 2019-05-24 12:43:29  cell phone, smart phone usages

నేటి ఆధునిక యుగంలో వయస్సుతో తేడా లేకుండా అందరు సెల్ ఫోన్లకు బానిస అవుతున్నారు .. ఎవరిని చుసిన సోషల్ మీడియా అప్స్ ని వాడేస్తున్నారు . కాస్త టైం దొరికినా స్మార్ట్ ఫోన్లలో బిజీ అయిపోతారు. బిజీ అంటే మాములు బిజీ కాదండోయ్ చుట్టుపక్కల ఏం జరుగుతోంది..? ఎవరు ఏం చేస్తున్నారు..? అన్న విషయాలనే మర్చిపోతున్నారు.



తాజాగా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. చైనాలో ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. షాపింగ్ కాస్త పూర్తయ్యాక ఇంటికి బయలుదేరారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన ఘటనొకటి చోటుచేసుకుంది.

ఫోన్ లో డీప్ గా మునిగిపోయిన బాలుడు తన తల్లి చేయిని పట్టుకోవడానికి బదులుగా మరో వ్యక్తి చేతిని పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి కూడా పిల్లాడి అమాయకత్వాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాడు. ఈ మొత్తం తతంగాన్ని మరో వ్యక్తి తన స్మార్ట్ ఫోన్ లో వీడియో తీస్తున్నాడు. చివరికి మాల్ నుంచి కొంతదూరం వెళ్లిన అనంతరం పిల్లాడు ఫోన్ నుంచి తలపైకి ఎత్తి చూశాడు. తనతో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాలుడు తన తల్లి దగ్గరకు పరుగులు పెట్టాడు. ఈ వీడియోను ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్ చల్ చేస్తోంది.