ప్రపంచ కప్ ముందు భీకర ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా

SMTV Desk 2019-05-24 12:40:03  Australia xi, New zealnd xi

ప్రపంచ సమరానికి ముందు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మంచి ఫామ్ లో వచ్చింది. భారత్‌లో భారత్‌ను ఓడించిన ఆసీస్.. ఆ తర్వాత పాకిస్థాన్‌నూ చిత్తు చేసి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మెగాటోర్నీకి సమయం దగ్గరపడు తుండగా.. న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది చేసుకుంది. పేరుకే ఆసీస్ ఎలెవన్ అయినా.. ఆ జట్టులో ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లందరూ ఉండటం విశేషం. శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో స్మిత్ (91 నాటౌట్; 10 ఫోర్లు) భారీ అర్ధశతకానికి మ్యాక్స్‌వెల్ (70; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో 16 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ఎలెవన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. విల్ యంగ్ (111; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కమిన్స్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 44 ఓవర్లలో 5 వికెట్లకు 248 పరుగులు చేసిన సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు.