చెవిలో ఏకంగా గూడు కట్టిన సాలీడు .. వైరల్ అవుతున్న వీడియో

SMTV Desk 2019-05-24 12:36:42  Spyder,

రాత్రి పడుకున్నప్పుడు పొరపాటున చెవిలో పురుగు చొరబడిందంటే ఇంక వాళ్లకు చూడాలి నరకమే. అది లోపలికి వెళ్లాక కొరుకుతుంటే లబోదిబోమని మొత్తుకుంటారు. చైనాలోని యంగ్‌జూలో ఒకతని చెవిలో సాలీడు పురుగు చొరబడి హాయిగా అక్కడ గూడు కూడా కట్టుకుంది. ఆ వక్తికి చాలా రోజులనుండి చెవిలో ఏదో నోప్పిగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్లను సంప్రదించాడు. మైక్రో స్కోప్ తో పరిక్షించగా డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సాలీడును బయటకు తీయడానికి వైద్య పరికరాలతో విశ్వ ప్రయత్నాలు చేసారు . అయితే ఆ సాలీడు తప్పించుకుపోతుండటంతో.. ఇక లాభం లేదనుకుని చెవిలో నీళ్లు పోసి సాలీడును బయటకు తీశారు. సాలీడు చిన్న సైజ్ లో ఉండటంతో తమ పరికరాలకు చిక్కలేదని చెప్పారు డాక్టర్లు. ఆతర్వాత అతని చెవిని క్లీన్ చేసి ఇంటికి పంపారు. యూట్యాబ్ లో ఈ వీడియో పెట్టగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.