కట్టలు తెంచుకున్న వరంగల్ కలెక్టర్ పై అభిమానం

SMTV Desk 2017-08-25 18:01:53  Collector, IAS Amrapali Kata, Warangal, Social media, Youngest IAS officer

వరంగల్, ఆగస్ట్ 25: చిన్న వయస్సులో కలెక్టర్ బాధ్యతలు స్వీకరించి, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాళి, తనదైన శైలిలో ప్రజల మన్నలను పొందింది అనటానికి ప్రత్యక్ష నిదర్శనం నేడు ఖాజీపేటలో చోటు చేసుకున్న సంఘటనే ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే... వినాయక చవితి నేపధ్యంలో ఆమ్ర‌పాలి త‌ల్లిగా మారి, వినాయ‌కుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకున్న‌ట్లుగా ఉన్న విగ్ర‌హాన్ని స్థానిక బాపూజీ నగర్ యువత త‌మ మండ‌పంలో ప్ర‌తిష్టించారు. బాపూజీ నగర్ యూత్ విభిన్నత ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. వీరి సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌తిఒక్క‌రూ కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి.