మోదీకి కూడా పెళ్లాం, పిల్లలు ఉంటే అలాగే చేసేవారు

SMTV Desk 2019-05-24 12:30:21  modi, congress, rajiv gandhi, personal taxi

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వెకేషన్ కోసం నేవీకి చెందిన యుద్ధనౌకను ట్యాక్సీలా ఉపయోగించుకున్నారన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటరిచ్చింది. మోదీకి కనుక కుటుంబం ఉండి ఉంటే ఆయన కూడా అదే పని చేసి ఉండేవారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు.

‘‘ఏ ప్రధానమంత్రి అయినా అలాగే చేస్తారు. ప్రధాని మోదీకి కూడా కుటుంబం ఉండి ఉంటే ఆయన కూడా అలాగే చేసేవారు. కానీ ఆయనేమో ఒంటరివాడు. ఫ్యామిలీతో ఆయనకు సంబంధమూ లేదు, కుటుంబ బంధాలపై విలువ లేదు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

1980లలో రాజీవ్‌గాంధీ లక్షద్వీప్‌లలో విహారయాత్ర కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను ‘పర్సనల్ టాక్సీ’లా ఉపయోగించుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.