సూర్యుడి భగభగలకు నేడు, రేపు బ్రేక్..చల్లని చిరుజల్లు

SMTV Desk 2019-05-24 12:28:48  telangana atmosphere, telangana weather, rainfall

గత వారం రోజులుగా ఎండలకు ఉడికిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాలు పడని ప్రాంతాల్లో మాత్రం వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు, కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది.