ఆయన గోడ మీద పిల్లి లాంటి వారు

SMTV Desk 2019-05-24 12:16:32  KCR, Kodanda ram, Dathatreya

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ పై రాష్ట్ర నాయకులు విరుచుకు పడ్డారు. బీజేపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, జనసమితి అధినేత కోదండరాం చంద్రశేఖర్ రావు పై విరుచుక పడ్డారు ఫెడరల్ ఫ్రంట్ నిలబడదని.. జాతీయ పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశంలోని అన్ని పక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటై ఉందని, మమతా బెనర్జీ కోల్‌కతాలో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. మే 23న ఫలితాల తర్వాత ఆ కూటమి క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందువల్ల కేసీఆర్ కూటమి ప్రయత్నాలు మానుకుని.. తెలంగాణలోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. దిల్లీలో జాతీయ మీడియాతో దత్తాత్రేయ మాట్లాడుతూ.. భాజపా, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారు. ఇలాంటి కూటమి అసాధ్యం. ఎందుకంటే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి మద్దతిస్తున్నాయి. చంద్రశేఖర్ రావు లాంటి వ్యక్తిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన గోడ మీద పిల్లి లాంటి వారు, అవకాశవాది అని వ్యాఖ్యానించారు.