విజయ్ బర్త్ డే పార్టీ మహేష్ ఇంట్లో.. పిక్ వైరల్

SMTV Desk 2019-05-11 16:26:36  Maharshi, Vijay devrakonda,

మహర్షి సినిమా రిలీజ్ నాడు స్పెషల్ ఏంటంటే తెలుగు యువ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే. నిన్న బర్త్ డే ఫ్యాన్స్ తో జరుపుకున్న విజయ్ దేవరకొండ మహర్షి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

మహేష్ కూడా మహర్షి హిట్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండను పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చాడు. విజయ్ బర్త్ డే పార్టీ మహేష్ ఇంట్లో జరిగిందన్నమాట. ఈ పార్టీలో మహర్షి దర్శక నిర్మాతలు మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ లిరిసిస్ట్ శ్రీమణి వీరంతా పాల్గొన్నారు. మహర్షి హీరోయిన్ పూజా హెగ్దెతో పాటుగా డియర్ కామ్రేడ్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పార్టీలో అందరు ఫుల్ గా ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.