ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్ ...

SMTV Desk 2019-05-11 16:23:55  shamshabad Airport

శంషాబాద్ విమానాశ్రయానికి మరో అరుదైయన్ గుర్తింపు లభించింది. విమానాశ్రయంలో పరిశుభ్రత, సౌకర్యాలు, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు తదితర అనేక అంశాలను ప్రమాణాలుగా తీసుకొని సర్వే చేసిన ‘ఎయిర్ హెల్ప్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచదేశాలలో 10 అత్యుత్తమ విమానాశ్రయాలలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది. దేశంలో ముంబై, డిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలలో దేనికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు.

ప్రపంచంలో 10 అత్యుత్తమ విమానాశ్రయాలు:

1. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఖత్తార్.

2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జపాన్.

3. ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, గ్రీస్.

4. అఫోంసో పెన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బ్రెజిల్.

5. జిడిఏఎన్ఎస్కె లేచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, పోలాండ్.

6. షెరిమిట్ యోవో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రష్యా.

7. చాంగి ఎయిర్ పోర్ట్ సింగపూర్, సింగపూర్.

8. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్‌.

9. తెనిరీఫ్ నార్త్ ఎయిర్ పోర్ట్, స్పైన్.

10. విరకోపోస్/ కాంపినాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బ్రెజిల్.

ప్రపంచంలో 10 చెత్త విమానాశ్రయాలు:

1. లండన్ గాట్విక్ ఎయిర్ పోర్ట్ , (బ్రిటన్)

2. బిల్లీ బిషప్ టోరొంటో సిటీ ఎయిర్ పోర్ట్ (కెనడా)

3. పోర్ట్ ఎయిర్ పోర్ట్ (పోర్చుగల్)

4. పారిస్ ఓర్లి ఎయిర్ పోర్ట్ (ఫ్రాన్స్)

5. మాంచెస్టర్ ఎయిర్ పోర్ట్ , (బ్రిటన్)

6. మాల్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (మాల్టా)

7. హెన్రీ కొవాండా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (రుమేనియా)

8. ఎయిండ్ హోవెన్ ఎయిర్ పోర్ట్ (నెధర్ ల్యాండ్స్)

9. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కువైట్)

10. లిస్బేన్ పోర్తెల ఎయిర్ పోర్ట్ (పోర్చుగల్).

ప్రపంచంలో 10 అత్యుత్తమ విమానయాన సంస్థలు:

1. ఖత్తార్ ఎయిర్ వేస్

2. అమెరికన్ ఎయిర్ వేస్

3. ఏరో మెక్సికో

4. కాంటాస్

5. శాసనసభ స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్

6. లాటమ్ ఎయిర్ లైన్స్

7. వెస్ట్ జెస్ట్

8. లక్స్ ఎయిర్

9. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్

10. ఎమిరేట్స్.