కొత్తవాళ్లను తీసుకొచ్చిన టీవీ9 నూతన యాజమాన్యం!

SMTV Desk 2019-05-11 16:17:59  tv9, news channel, telugu news channel

ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 వ్యవహారాల్లో మరింత వేగం పెరిగింది. చానల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రవిప్రకాశ్ పై ఆరోపణలు వచ్చిన తొలిరోజున మీడియాలో విపరీతమైన హడావుడి కనిపించగా, రెండోరోజున ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థపై తమదైన ముద్ర వేయాలని భావిస్తున్న టీవీ9 నూతన యాజమాన్యం అలంద మీడియా గ్రూప్ చానల్ కు సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

హైదరాబాద్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పాత సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసి కొత్తవాళ్లను తీసుకొచ్చారు. టీవీ9 కొత్త సీఈవోగా మహేందర్ మిశ్రాను, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించడం తెలిసిందే. పరిస్తితి చూస్తుంటే, రవిప్రకాశ్ సన్నిహితులకు కూడా చానల్ నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. కాగా, టీవీ9 డైరక్టర్ల బృందం ఇవాళ సాయంత్రం మీడియా ముందుకు వచ్చి తాజా పరిణామాలపై వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.