'సైరా' రిలీజ్ డేటుపై చర్చలు

SMTV Desk 2019-05-11 16:16:45  sai ra, chiranjeevi, tamannah, nayanathara

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో చిరు నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. చిరుకి జంటగా నయనతార నటిస్తున్నారు. కిచ్చ సుధీప్, జగపతి బాబు, తమన్నా.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని ఇటీవల రామ్ చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, రిలీజ్ డేటుపై చర్చలు జరుగుతున్నాయి. దసరాకి అనుకొంటున్నారు. కానీ ఆ డేటు రావడం కష్టమంటున్నారు. ఒకవేళ దసరా వస్తే మాత్రం అక్టోబర్ 2కి ఫిక్స్ కానున్నారు. ఆ డేటు అనుకొంటే దాదాపు రెండు వారాల సెలవులు రోజులు రానున్నాయి. దీంతో కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయమంటున్నారు.