నడి రోడ్డుపై వీహెచ్ వీరంగం.. చలాన్లు వసూలు చేస్తున్న పోలీసులపై ఫైర్

SMTV Desk 2019-05-11 16:14:07  vh, congress senior leader, v. hanumantha rao

మండుటెండల్లో వాహనదారులను ఆపి చలాన్లు రాస్తున్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. హైదరాబాదులోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహదారులను ఆపి, చలాన్లు వేస్తున్న సందర్భంలో... అటువైపుగా వీహెచ్ వెళ్తున్నారు. చలాన్ల వ్యవహరాన్ని గమనించిన ఆయన... కారు నుంచి దిగి, మొదట వాహనదారులతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులపై ఫైర్ అయ్యారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అందరినీ పంపించేయాలని గదమాయించారు. అంతేకాదు, దగ్గరుండి వాహనదారులను పంపించేశారు.