మహేష్ ఫ్లెక్సీ కడుతూ అభిమాని మృతి

SMTV Desk 2019-05-11 15:48:38  mahesh babu, maharshi, mahesh fan

మహర్షి సినిమా రిలీజ్ వేళ విషాదం చోటు చేసుకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరానికి చెందిన యర్రంశెట్టి రాజీవ్‌ (27) మహేష్ కు వీరాభిమాని. మహర్షి రిలీజ్ నేపథ్యంలో మురళీకృష్ణ థియేటర్‌ థియేటర్ వద్ద ప్లీక్సీ కట్టడానికి వచ్చారు.

ఐరన్ ఫ్రేముతో భారీ ప్లెక్సీ తయారు చేయించాడు. దాన్ని అక్కడ అమర్చేందుకు మురళీకృష్ణ థియేటర్‌ పక్కన బిల్డింగ్‌పైకి ఎక్కాడు. ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన రాజీవ్ ని ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు.

వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహర్షి తెరకెక్కింది. ఇందులో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతు పాత్రల్లో అలరించారు. ఆయనకి జంటగా పూజా హెగ్డే నటించారు. అల్లరి నరేష్ కీలక పాత్రల్లో నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి మెగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొంది.