హృతిక్‌ రోషన్ ని హెచ్చరించిన కంగనా సోదరి

SMTV Desk 2019-05-11 15:47:19  hrithik roshan, kangana ranaut, rakesh roshan

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కంగనా ల గొడవ గురించి తెలిసిందే. ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో ఆరోపణలు చేసుకొన్నారు. కోర్టు వరకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరు సలైంట్ అయిపోయారు. తాజాగా కోర్టులు కూడా చేతులెత్తేశాయ్. ఆ తర్వాత హృతిక్, కంగనా సలైంట్ అయిపోయారు. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. ఐతే, బద్ద శత్రువులైన హృతిక్, కంగనా సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

హృతిక్‌ రోషన్ నటిస్తున్న ‘సూపర్‌ 30’, కంగన నటిస్తున్న ‘మెంటల్‌ హై క్యా’ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకురానున్నాయి. హృతిక్ తో పోటీపడటం కంగనాకి కూడా ఇష్టం లేదు. దీంతో తన సినిమాని వాయిదా వేయాలని నిర్మాత ఏక్తా కపూర్‌ను కోరందట. అందుకు ఏక్తా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో హృతిక్ తో పోటీపడటం కంగనాకి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కంగనా సోదరి రంగేలీ.. హృతికి గట్టి హెచ్చరికలు చేసింది. హృతిక్‌.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో. ఇక నీ పనైపోయింది’ అంటూ హెచ్చరించింది.