జయరామ్‌ హత్యకేసు: రాకేష్ రెడ్డి పై పీడీ యాక్ట్ నమోదు

SMTV Desk 2019-05-11 15:44:42  jayaram case, rakesh

ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడటంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు పీడీయాక్ట్‌ అమలు చేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు.