గతంలో చేసిన తప్పు.. ఇప్పటికీ వెంటడూనే ఉంది

SMTV Desk 2019-05-10 17:05:16  vijay deverakonda, vijay, hindustan times

టాలీవుడ్ సన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ గతంలో చేసిన తప్పు.. ఇప్పటికీ వెంటడూనే ఉంది. ఇంతకీ విజయ్ చేసిన తప్పేంటో తెలుసా ? తన పేరుని తప్పుగా రాసుకోవడమే. అవునూ.. స్కూల్ లో ఉన్నప్పుడు తన పేరుని విజయ్ దేవెరకొండగా రాశాడట. అప్పటి నుంచి కొందరు అలాగే పిలుస్తున్నారు.

హిందూస్థాన్ టైమ్స్ సంస్థ నిర్వహించిన ఇండియాస్ మోస్ట్ స్టైలిస్ట్ స్టార్ అవార్డ్స్ వేడుకలో విజయ్, హాటెస్ట్ స్టైలిష్ స్టార్ అవార్డును అందుకున్నారు. అయితే అవార్డును ప్రకటించే క్రమంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ‘విజయ్ దేవరాకొండ’ అని సంబోధించారు. ఈ సందర్బంగా ఓ విలేఖరి ఇండస్ట్రీలో మిమ్మల్ని ఫ్యాన్స్ ఎన్ని పేర్లతో పిలుస్తారూ అని అడిగగా.. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు సొంత పేరు తప్పురాసుకున్నవారిలో నేనే మొదటి వ్యక్తిననుకుంటా అన్నారు. స్కూల్లో ‘దేవెరకొండ’అని రాశాను..అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతుందన్నారు.