అమెరికా అబ్బాయితో....చిత్తూరు చిన్నది

SMTV Desk 2019-05-10 17:02:51  love marriage, inter religious marriage, foreign wedding

ఇటీవల కాలంలో మనదేశంలో కూడా ఖండాంతర వివాహలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్న మనవాళ్లు పాశ్చాత్యులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనిరీష అనే అమ్మాయి అమెరికా దేశీయుడు ఆండ్రూ గ్రెయినర్ తో మూడు ముళ్లు వేయించుకుంది. గురువారం హిందూ వివాహ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి చిత్తూరులోని ఓ హోటల్ వేదికగా నిలిచింది.

చిత్తూరు ఉషానగర్ కు చెందిన సుధాకర్, కుమారిల తనయ శ్రీనిరీష 2013లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. అక్కడే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతుండగా సహాధ్యాయి ఆండ్రూ గ్రెయినర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఎంఎస్ పూర్తయిన పిమ్మట ఇద్దరూ అక్కడే సాఫ్ట్ వేర్ కొలువులు సంపాదించుకున్నారు. వీరి ప్రేమకు ఆండ్రూ తల్లిదండ్రులు పీటర్ గ్రెయినర్, షారోన్ కూడా అంగీకరించారు. ఇటు, భారత్ లో ఉన్న తన తల్లిదండ్రులను శ్రీనిరీష ఒప్పించడంతో వీరి పెళ్లికి మార్గం సుగమం అయింది.