కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల పరస్పర దాడులు!

SMTV Desk 2019-05-10 17:00:34  congress, trs, uttham kumar reddy

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పీక్లా నాయక్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. మూడో విడత ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ తండాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తమ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.