జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపాలు

SMTV Desk 2019-05-10 16:56:19  japan, earthquake, rectar scale, geological survey

జపాన్‌లో నేటి ఉదయం రెండు భారీ భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మియాజకి నగరానికి తూర్పు ఆగ్నేయంగా తొలిసారి 5.1 తీవ్రతతో భూమి కంపించింది. పసిఫిక్ జలాల్లో 35 కిలోమీటర్ల లోతున భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రెండోసారి మళ్లీ ఇదే ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. కాగా, భూకంపాల వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. అలాగే, ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 15వేలమంది మరణించారు.