రవి ప్రకాష్ పై వైసీపీ లీడర్ సెటైర్స్

SMTV Desk 2019-05-10 16:53:35  ravi Prakash, Vijay sai reddy

టీవీ9 సీఈవో రవిప్రకాష్ ఎపిసోడ్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెరుగైన సమాజం కోసం...కులం గోడలు కూల్చేద్దాం...!అంటూ మహత్తరమైన ఆదర్శాలను వల్లి వేస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు తాను వల్లించిన ఆదర్శాలను తుంగలో తొక్కేసి కల్లబొల్లి వార్తలతో అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు ఈ పగటి మోసగాడిని చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్జాడు. ఒక పారిశ్రామికవేత్త కూడా సాధించలేని రీతిలో అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు.. అంటూ విజయ్ సాయి రెడ్డి పోస్ట్ చేసారు ..