అన్నంతపని చేసిన అమెరికా అధ్యక్షుడు

SMTV Desk 2019-05-10 16:51:59  trump, china, beijing, chinese products,

చైనా దిగుమతులపై సుంకాన్ని పెంచుతామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్... అన్నంత పనీ చేసేశారు. 200 బిలియన్ డాలర్ల మేర చైనా దిగుమతులపై సుంకాలను పెంచారు. పలు వస్తువులపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలను పెంచేశారు.

అయితే, ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం పట్ల చైనా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సుంకాల పెంపు సరైన చర్య కాదని తెలిపింది. అమెరికా తీరు చైనాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పింది. తన నిర్ణయాన్ని అమెరికా పున:సమీక్షించుకోవాలని... లేని పక్షంలో తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా చైనా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ....... అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రపంచ వృద్ధి రేటు కుదుపుకు గురవుతుందని తెలిపారు.