'మహర్షి' సినిమా వీక్షించిన మహేశ్ ఫ్యామిలీ

SMTV Desk 2019-05-10 16:50:25  mahesh, maharshi, krishna, pooja hegde

నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మహేశ్ బాబు 25వ చిత్రం మహర్షి మంచి టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రం యూనిట్ పై పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. మరోవైపు, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబసభ్యులతో కలసి ఈ చిత్రాన్ని వీక్షించారు.

విజయనిర్మల, నరేశ్ లతో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలసి సినిమా చూశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ, సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. విద్యార్థిగా, వ్యాపారవేత్తగా, రైతుగా మూడు పాత్రల్లో మహేశ్ నటన అదిరిపోయిందని తెలిపారు.

ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, ఈ సినిమాను తాను చూడటం ఇది రెండో సారని చెప్పారు. రైతు పాత్రలో మహేశ్ ఒదిగిపోయాడని, రైతులకు గౌరవాన్ని ఇవ్వాలనే సందేశం తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. మహేశ్ కెరీర్లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా మిగులుతుందని చెప్పారు.