రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా

SMTV Desk 2019-05-10 16:42:00  selfie, rail

సెల్ఫీలతో ప్రమాదాలు జరుగుతున్న,ప్రాణాలు పోతున్నా యువతలో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ఓ యువకుడు రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలి షాక్ గురయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సమ్మర్‌గంజ్ మండి రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.