క్షమాపణలు అడిగిన బాలీవుడ్ బాద్ షా.. షారుక్..!

SMTV Desk 2017-08-25 14:40:05  sharuk khan, karan johar, mithaali raj, ted talk program.

ముంబై, ఆగస్ట్ 25 : "ఛేంజింగ్ రిలేషన్ షిప్స్" పేరుతో మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై "టెడ్ టాక్" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తో పాటు కరణ్ జోహార్, మిథాలీ రాజ్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్ లు చాలా ఆలస్యంగా వచ్చారు. దీంతో వీరిద్దరి రాక కోసం ఈ కార్యక్రమ నిర్వాహకులు మిథాలీ రాజ్ ను దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేయించారు. దీంతో ఆలస్య౦ చేసినందుకు షారుక్ ఖాన్ వచ్చి రాగానే మిథాలీ దగ్గరకు వెళ్లి క్షమించని అడిగారు. అంతేకాకుండా తమ ఆలస్యానికి కారణాలను కూడా వివరించినట్లు సమాచారం.