తేజ్ బహదూర్ కి సుప్రీమ్ కోర్ట్ లో చుక్కెదురు

SMTV Desk 2019-05-10 14:12:30  samaj wadi party, Tej bahadur,

బీఎస్‌ఎఫ్ మాజీ జవాను, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి తేజ్ బహదూర్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారణాసి నుంచి తాను దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన తేజ్‌బహదూర్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు తమకు సరైన కారణాలు కనపడలేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఫుడ్ బాలేదని ఒక వీడియో విడుదల చేయడంతో సైన్యం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ బహదూర్ వారణాసి నుంచి ఎస్పీ తరపున నామినేషన్ వేశారు. అయితే అవినీతి వల్లగానీ లేదా అవిధేయత వల్లగానీ సైన్యం తనను తొలగించలేదంటూ సర్టిఫికెట్ తీసుకురావడంలో బహదూర్ విఫలం కావడంతో నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తేజ్ బహదూర్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హేతుబద్ధంగా లేదు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది.