సీత ట్రైలర్ చూసారా ...

SMTV Desk 2019-05-10 14:11:42  Seetha Trailer,

లక్ష్మీకళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు ఆమెను సీతగా చూపించబోతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ జంటగా తేజ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గత నాలుగు నెలలుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘సీత’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించారు. ‘RX 100’ భామ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల విడులైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇటీవలే ఖరారు చేశారు. మే 24న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సినిమా నుండి ట్రైలర్ విడుదలైయింది. ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను క్రియేట్ చేసింది. ఎమోషనల్ కంటెంట్ తో కథ అంత సీత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఎందుకో ట్రైలర్ చూస్తే ఎక్కడో చూసిన కధలానే అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా మనోడు హిట్ కొడతాడేమో చూడాలి మరి.