కంప్యూటర్ నేర్చుకునే వారికి సువర్ణావకాశం

SMTV Desk 2019-05-10 14:05:21  Computer coaching,

ఉచిత కంప్యూటర్ శిక్షణ పేరుతో రోజూ పేపర్లలో ప్రకటనలు వస్తుంటాయి. కానీ వాటిలో చాలా వరకు మోసపూరితమైనవే ఉంటున్నాయి. ఉచిత శిక్షణ అని చెపుతూనే మళ్ళీ ఏదో పేరుతో ఫీజులు వసూలు చేస్తుంటాయి. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించిన అప్సా-టెక్ మహీంద్రా, ఫౌండేషన్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తోంది. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణా కార్యక్రమాలలో నిరుద్యోగులకు కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్ కాన్స్పెట్, ఇంగ్లీషులో మాట్లాడటం, టైపింగ్ వంటివి ఆయా రంగాలలో నిపుణుల చేత ఉచితంగా నేర్పిస్తారు.

ఈ శిక్షణ పొందడానికి కనీస విద్యార్హత 10వ తరగతి పాసై ఉండాలి. ఇంటర్మీడియట్‌ పాస్ లేదా ఫెయిల్ అయినవారు, 18-27 సం.ల మద్య వయసున్న యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు. ఆసక్తిగలవారు ముషీరాబాద్ చౌరస్తా వద్ద గల ఆప్సా టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ టెక్నికల్ ట్రెయినింగ్ సెంటరులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ శిక్షణకు సంబందించి పూర్తి వివరాల కోసం 99490 25230, 84980 89786 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

ఈరోజుల్లో ఏ ఆఫీసులో పనిచేయాలన్నా కంప్యూటరుపై పనిచేయడం, ఇంగ్లీషులో సమాధానం చెప్పగలిగే నేర్పు చాలా అవసరం. ఇదే శిక్షణ బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూటులలో నేర్చుకోవాలంటే వేలరూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఆప్సాటెక్ మహీంద్రా ఫౌండేషన్ అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకొంటే వారి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి