మహేష్ బాబు .. నమత్ర పిక్ వైరల్

SMTV Desk 2019-05-10 14:03:20  Mahesh Babu, Namrata,

ప్రపంచ వ్యాప్తంగా మహేష్ మహర్షి మానియాలో పడింది. ఈరోజు మహర్షి సినిమా గ్రాండ్ రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇందుకు ఊతమిచ్చేలా మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మహర్షి సినిమా షూటింగ్ సమయంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఎంతగా కష్టపడ్డారో కళ్లారా చూశానని ఆమె తెలిపారు.
ఆమె ఏమన్నారంటే.. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వు పడిన కష్టాన్ని నేను చూశా.. ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూస్తోంది. గుడ్‌ లక్‌ టు మై లవ్‌ మహేశ్‌ అని.. రిషి పాత్ర నాకెంతగా నచ్చిందో ప్రేక్షకులకి కూడా అంతేలా నచ్చుతుందని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు.
కాగా నమత్ర మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. మహేశ్‌ నమ్రత వెనక దాక్కొని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సామాజికమాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.