ఎమ్మెల్సీలకి తాత్కాలిక ఊరట

SMTV Desk 2019-05-10 14:02:20  MLC,

తెలంగాణ‌లో అన‌ర్హ‌త‌కు గురైన ఎమ్మెల్సీల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. కాగా, ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని హైకోర్టు ఆదేశించింది. అయితే, త‌మ‌ను అన్యాయంగా ఎమ్మెల్సీ ప‌ద‌వుల నుంచి తొల‌గించారంటూ ఎమ్మెల్సీలు యాద‌వ‌రెడ్డి, భూప‌తిరెడ్డి, రాములు నాయ‌క్‌లు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో యాద‌వ‌రెడ్డి, భూప‌తిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్స్‌పై హైకోర్టు ఈ రోజు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా యాద‌వ‌రెడ్డి, భూప‌తిరెడ్డి ఎమ్మెల్సీ స్థానాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయొద్దంటూ ఎన్నిక‌ల సంఘానికి హైకోర్టు సూచించింది. రాములు నాయ‌క్ పిటిష‌న్‌పై ఈ నెల 15వ తేదీన విచార‌ణ జ‌ర‌ప‌నుంది.