మీ చెవి పట్టుకుని.. 100 గుంజిళ్లు తీయాలి.. మోదీ పై మమత ఫైర్ ...

SMTV Desk 2019-05-10 14:00:09  Mamata. Modi,

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ... నేను ప్రధాని మోడీకి సవాలు విసురుతున్నా. బొగ్గు మాఫియాలో మా 42 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో ఎవరైనా ఉన్నట్లు మీరు రుజువు చేస్తే మా అభ్యర్థులందరినీ ఉపసంహరించుకుంటా. రుజువు చేయడంలో మీరు ఫెయిలైతే ప్రజల ముందు మీ చెవి పట్టుకుని.. 100 గుంజిళ్లు తీయాలి. మీరు ఈ సవాలును స్వీకరిస్తారా? మీ భార్య గురించి మీరు పట్టించుకున్నట్లయితే మీరు ఇతరుల సంక్షేమం గురించి కూడా పట్టించుకునే వారు. ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ? పార్లమెంట్ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మేము నిరుద్యోగాన్ని 40 శాతం తగ్గించాం. భారతదేశ చరిత్రపై మోడీ నాతో చర్చ జరపాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధందా తాను ప్రధాని మోడీని చెంపదెబ్బ కొడతానని ఎప్పుడూ అనలేదు. ప్రజాస్వామ్య దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని వివరించారు. అలాగే... మీరు భాషను సరిగ్గా అర్థం చేసుకోవాలని... ప్రజాస్వామ్య దెబ్బ అంటే ప్రజల నిర్ణయమని దీదీ స్పష్టం చేశారు. తాను ప్రధానిని ఎందుకు కొడతాను? అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. కాగా.. ఈ మధ్య ఓ ర్యాలీలో మమతా మాట్లాడుతూ.. మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ అంటే ఏమిటో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు. మోడీ దీనిపై స్పందిస్తూ... దీదీ చెంపదెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే అంటూ తెలపడం విశేషం.