గౌరీ లంకేష్‌ హత్య కేసులో ఆమెకు ఊరట

SMTV Desk 2019-05-10 13:59:22  Gouri lankesh, BJP,

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ హత్య కేసులో బీజేపీ ఎంపీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌరీ లంకేశ్... హత్య కేసు వ్యవహారంలో సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌కి ఊరట లభించింది.

అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అదేమంటే.. గౌరీ లంకేష్‌ హత్యతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది కూడా. దీంతో ఈ కేసులో ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ ప్రమేయం ఉన్నట్టుగా విచారణలో తాము ఎక్కడా గుర్తించలేదని కూడా సిట్ ప్రకటించింది. కోర్టుకు సమర్పించిన పత్రాలలోనే ఆమె ప్రమేయాన్ని రుజువు చేసే ఆధారాలు ఎక్కడా లభ్యం కాలేదని కూడా వివరించింది.

కాగా 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన స్వగృహంలో గౌరీ లంకేష్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.